ఆరు హెలికాప్టర్లతో సలార్కు సలామ్.. ఇది అరాచకం భయ్యా!

ఆరు హెలికాప్టర్లతో సలార్కు సలామ్.. ఇది అరాచకం భయ్యా!

ప్రస్తుతం ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ సలార్(Salaar). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పదిరోజుల ముందుకు నుండే సంబరాలు మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్. థియేటర్స్ దగ్గర కటౌట్ లు, భారీ బైక్ ర్యాలీలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే తాజాగా.. తాజాగా కెనడాలోని డార్లింగ్ ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన చేశారు. భారీ హెలికాప్టర్లతో సలారోడికి ఎయిర్​ సెల్యూట్​ చేశారు. కెనడాలోని టొరొంటో నగరంలోని పచ్చన మైదానంలో సాలార్ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసి.. ఆరు హెలికాప్టర్లు ఒకేసారి గాల్లోకి ఎగిరేలా ఏర్పాటు చేశారు. ఆ హెలికాఫ్టర్లో సెల్యూట్‌ చేస్తున్నట్లుగా వీడియో క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. ఒక సినిమా కోసం ఈ  రెంజ్లో ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది మా ప్రభాసన్న రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సలార్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీ రోల్స్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలకానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.