దసరా దర్శకుడితో ప్రభాస్.. ఊరమాస్ కాంబోకు రంగం సిద్ధం

దసరా దర్శకుడితో ప్రభాస్.. ఊరమాస్ కాంబోకు రంగం సిద్ధం

నేచురల్ స్టార్ నాని(Nani)తో దసరా(Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు శ్రీకాంత్. అప్పటినుండి ఈ దర్శకుడు తన రెండో  సినిమాను ఏ స్టార్ తో చేయనున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీకాంత్ ఓదెల తన తరువాతి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడట. ఇటీవలే శ్రీకాంత్ ప్రభాస్(Prabhas) కోసం ఊరమాస్ కథను వినిపించాడట. దసరా సినిమాలాగే ఈ సినిమా కూడా రా అండ్ రస్టిక్ కంటెంట్ తో రానుందని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఇంతకుముందెన్నడూ కనిపించనంత కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తారట. ఇక శ్రీకాంత్ చెప్పిన పాయింట్ కూడా ప్రభాస్ కు విపరీతంగా నచ్చిందట. ప్రస్తుతం చర్చల దశలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తుందని సమాచారం. మరి ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సలార్ నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా  ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.