ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ షూటింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లపై ఇప్పటికే కొంత పార్ట్ చిత్రీకరించగా, తాజాగా రెగ్యులర్ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 17 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి భారీ షెడ్యూళ్లతో చిత్రీకరణ కొనసాగించనున్నారు.
ఈ షెడ్యూల్లో ప్రభాస్‌తోపాటు కొత్తగా సాయిపల్లవి కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో దీపిక పదుకొణె నటించగా, కొన్ని అనివార్య కారణాలతో ఆమెను ఈ చిత్రం నుంచి తప్పించారు మేకర్స్. ఇప్పుడు పార్ట్ 2లో సాయిపల్లవిని సెలెక్ట్ చేయగా, ఈ షెడ్యూల్లో ఆమె కూడా పాల్గొనబోతోంది. అలాగే నవంబర్ నుంచి ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా, ఆ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ జాయిన్ కానున్నారు. 2027 జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’తోపాటు ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు.
