కల్కి 2898 AD బిగ్ అప్డేట్..ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్..

 కల్కి 2898 AD బిగ్ అప్డేట్..ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్..

సైన్స్ ఫిక్షన్ అండ్ స్కైఫై కథతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ ప్రాజెక్టు Kalki 2898 AD. ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కల్కి2898AD హృదయాల నుండి, ఎడిటింగ్ రూమ్ నుండి నేరుగా ప్రభాస్ ను చూడండి అంటూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ వీడియోలో ప్రభాస్ ఫైర్ గన్ తో కనిపిస్తూ..వెనుకాల టిక్నికల్ మెషీన్స్ తో హైప్ పెంచేశారు. ఈ వీడియో నిడివి 5 సెకన్లు అయినా క్యూరియాసిటీ పెంచేశారు. కల్కి నుంచి రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా..చిరు లీక్స్ నుంచి ప్రేరణ పొంది రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపారు.  

హిందూ పురాణాల ప్రకారం కల్కీ అనేది కలియుగాంతంలో వచ్చే విష్ణుమూర్తి పదవ అవాతారం. ఈ ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి వెలుగులా ఉద్బవిస్తుందని, ఆ అవతారమే కల్కి అని మన పురాణాలలో రాసి ఉంది. 

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని,దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్,  రానా దగ్గుబాటి కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.