Making Video: సలార్ స్పెషల్ సర్‌ప్రైజ్..ఈ వీడియో చూశారా ?

Making Video: సలార్ స్పెషల్ సర్‌ప్రైజ్..ఈ వీడియో చూశారా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం సలార్(Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది సలార్ మూవీ. దీంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. రిలీజైన రెండు రోజుల‍్లోనే రూ.295 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాపీస్ లెక్కలు తిరగరాయుటకు పరుగెడుతోంది. ఇదిలా  ఉంచితే..అదిరిపోయే కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న టైంలో మూవీ టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.

ఖాన్సర్ ఎలా ఎరుపెక్కిందో..దీని కోసం మేకర్స్ ఎలా కష్టపడ్డారో..ఈ వీడియోలో చూపించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'సలార్' సినిమాను అందరికీ గూస్బంప్స్ వచ్చేలా సీన్స్ ఎలా తీశారనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి ఉంటుందని..అందుకోసమే ఈ స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.

ఇందులో ఫైట్ సీన్స్‌కి సంబంధించిన సీన్స్ ఎలా తీశారనేది ఆసక్తిగా చూపించారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్..ఫైట్ మాస్టర్ చేసే పోరాటాలు..మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ తెర వెనుక చేసిన మ్యాజికల్ మ్యూజిక్ ను, నటి నటుల పెర్ఫామెన్స్ ఈ వీడియోలో ఆసక్తిగా చూపించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సొషల్ మీడియాలో దూసుకెళ్తోంది.