Prabhas Maruthi Combo: పండుగ రోజు వింటేజ్ డార్లింగ్ వస్తున్నాడు

Prabhas Maruthi Combo: పండుగ రోజు వింటేజ్ డార్లింగ్ వస్తున్నాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో డైరెక్టర్ మారుతి(Maruthi)తో చేస్తున్న సినిమా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఈ సినిమా. గత కొన్ని నెలలుగా ఈ సినిమా నుంచి లీక్ అవుతున్న స్టిల్స్, పలు టైటిల్స్..అలా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 

లేటెస్ట్గా మారుతి..ప్రభాస్ కాంబో నుంచి ఆఫీసియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ అండ్ టైటిల్ ప్రకటించబోతన్నట్లు తెలిపారు. సంక్రాంతి రోజున ఉదయించే సూర్యుడితో పాటు, రెబల్ స్టార్ ప్రభాస్ మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వడానికి..వింటేజ్ లుక్ తో డార్లింగ్ వ‌స్తున్నాడు. జనవరి 15వ తేదీన ఉదయం 7:08 గంటలకు రెడీగా ఉండండి అంటూ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాకు రాజా సాబ్, రాజా డీలక్స్,రాయల్, అంబాసిడర్, అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 

హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో రీద్దీ కుమార్ (Riddi kumar), మాళవిక మోహన్ (Malavika Mohan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్స్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Datt) మరో కీ రోల్లో కనిపించనున్నారు.