ప్రభాస్ పేరు మారింది గమనించారా.. ఇకనుంచి అలానే!

ప్రభాస్ పేరు మారింది గమనించారా.. ఇకనుంచి అలానే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా క్రేజీ సినిమాలు సెట్ చేస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తున్నారు. ఇటీవలే సలార్(Salaar) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన చాలా గ్యాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా మారుతి కాంబోలో వస్తున్న సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ మేకర్స్. ఈ సినిమాకు ది రాజాసాబ్ అనే టైటిల్ ఖరారు చేస్తూ అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించిన ప్రభాస్ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కారణం ఈ పోస్టర్ లో ప్రభాస్ పేరు మార్చి రాశారు. మాములుగా ప్రభాస్ పేరు ఇంగ్లీష్ లో PRABHAS అని రాసేవారు. కానీ, రాజాసాబ్ పోస్టర్ లో PRABHASS అని ఉంది. పేరులో మరో S లెటర్ ను యాడ్ చేశారు.

ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఏంటి ప్రభాస్ న్యూమరాలజీతో పేరు సరిచేసుకున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి  కొంతకాలంగా ప్రభాస్ కు సరైన హిట్టు లేదు. ఆ కారణంగానే పేరులో మార్పు చేసుకున్నారు అని తెలుస్తోంది. అందుకే ది రాజాసాబ్ తో అయినా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యారట. మరి పేరు మార్పుతోనైనా హిట్టు కొడతాడా చూడాలి మరి.