సలార్ నటుడి ఆది జీవితం.. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన ప్రభాస్

సలార్ నటుడి ఆది జీవితం..  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేసిన ప్రభాస్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) హీరోగా నటించిన చిత్రం ది గోట్ లైఫ్(The Goat Life)(ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు. నైంటీస్‌‌‌‌‌‌‌‌లో జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే కేరళ యువకుడి రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఇది. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందించిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ సినిమా ఇది కావడం విశేషం. బుధవారం ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

హీరో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా విడుదల చేసి బెస్ట్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. ‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో వీరిద్దరూ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ అవడం సంతోషంగా ఉందని, ఐదేళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డానని పృథ్వీరాజ్‌‌‌‌‌‌‌‌ ఈ సందర్భంగా తెలియజేశాడు. అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, ప్రముఖ అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.