Salaar Big Update : గుర్తు పెట్టుకోండి..సలార్ ట్రైలర్ డేట్ ప్రకటించిన మేకర్స్

 Salaar Big Update :  గుర్తు పెట్టుకోండి..సలార్ ట్రైలర్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ లలో సలార్ (Salaar) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabahs) హీరోగా వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ తోపాటు, ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేజిఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

లేటెస్ట్గా సలార్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మోస్ట్ వెయిటింగ్ సలార్ ట్రైలర్ను వచ్చే నెల డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ గంభీరంగా..ఓ జీప్పై నిల్చుని..చేతిలో గన్ పట్టుకుని..ఫైర్ చేస్తున్న పోస్టర్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ అప్డేట్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్కు ఆకలి తీరిపోయిన ఫీలింగ్ ఇచ్చారు మేకర్స్. ఇక ట్రైలర్తో ఫుల్ మీల్స్ కన్ఫర్మ్..అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ఇప్పటికే రిలీజైన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో సలార్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజిఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.

మరి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.