SalaarFirstSingle: సూరీడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి..సలార్‌ స్నేహం వచ్చేసింది

SalaarFirstSingle: సూరీడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి..సలార్‌ స్నేహం వచ్చేసింది

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ సలార్‌ (Salaar). కేజీఎఫ్‌ చిత్రాలతో సంచనలం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. సూరీడే గొడుగు పట్టి..వచ్చాడే భుజము తట్టి..చిమ్మచీకటి నీడలోన ఉండేటోడు..అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ స్నేహం గొప్పదనం చెబుతోంది. రెప్పనొదలక కాపుకాసేడి కన్నువాడు..” అంటూ స్నేహానికి చిహ్నంలా ఉన్న లిరిక్స్ గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. కేజీఎఫ్‌ రెండు పార్ట్లకి అదిరిపోయే ఆల్బమ్ అందించిన కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్న్ రవి బాసృర్ మరోసారి అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా..హరిణి పాడారు. 

ఇక పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..ప్రమోషన్స్‌ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. దీంతో సలార్ పాటల నగరా వినిపించుటకు మేకర్స్ వరుస అప్డేట్స్ తో రానున్నారు.

సలార్ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ దక్కింది. యాక్షన్ సీన్లలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఏ రేటింగ్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఈ మూవీ రన్ టైమ్ ఉండనుంది.