డైనోసార్ వేట మొదలు.. ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఈ ఇయర్ టాప్ సలార్

డైనోసార్ వేట మొదలు.. ఫస్ట్ డే కలెక్షన్ల ఊచకోత.. ఈ ఇయర్ టాప్ సలార్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది సలార్ మూవీ.
 
ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం మేరకు సలార్‌ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.175 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిందట. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారానే రూ.90 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాదించిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది సలార్‌. ఆ తర్వాతి స్థానంలో దళపతి విజయ్ లియో, ఆదిపురుష్ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మొదటిరోజు రూ.140 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా RRR ఉంది. ఈ సినిమా మొదటి రోజు రూ.223 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రూ. 165 కోట్లతో రెండో స్థానంలో కేజీఎఫ్‌-2 మూవీ ఉంది. దీంతో ఇండియా వైడ్ గా మొదటిరోజు బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో సలార్‌ రెండో స్థానానికి చేరుకుంది.

ఇక సలార్ సాధిస్తున్న రికార్డ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి సలార్ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. కారణం షారుఖ్ ఖాన్ నటించిన డంకి మూవీ పోటీలో ఉండటం. దానివల్ల సలార్ సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. డంకి పోటీలో లేకపోయుంటే సలార్ కలెక్షన్ల సునామి సృష్టించేది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. లాంగ్ రన్ లో సలార్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా.