సాలార్ టీ షర్ట్స్ వచ్చేశాయి.. ధర చూస్తే షాకవ్వాల్సిందే

సాలార్ టీ షర్ట్స్ వచ్చేశాయి.. ధర చూస్తే షాకవ్వాల్సిందే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్(Kgf) చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా రోజులుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగానే సలార్ టీ షర్ట్‌లు మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. వీటి కోసం ప్రభాస్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. సలార్ నిర్మాణ సంస్థ హోంబలే వెర్సెస్ వెబ్‌సైట్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్క డ కేవలం సలార్ టీ-షర్ట్ కాకుండా.. హూడీ, హార్మ్ స్లీవ్‌లను కూడా అందుబాటులో ఉంచారు.

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. వీటి ధరలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. టీ-షర్టు ధర రూ.499 నుంచి రూ.1499 వరకు ఉంది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అంతంత ధరలు పెడితే సామాన్యాలు ఎలా కొంటారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్స్ క్రేజ్ ను ఇలా కూడా క్యాష్ చేసుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.