వీకెండ్ మస్త్ : ఇంటింటా దుమ్మురేపుతున్న సలార్

వీకెండ్ మస్త్ : ఇంటింటా దుమ్మురేపుతున్న సలార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.230 కోట్లు కొల్లగోట్టిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.700 కోట్లు వసూళ్లు రాబట్టి చాలా కాలం తరువాత ప్రభాస్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది సలార్ మూవీ. 

ఇక సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలరోజులు గడుస్తున్నా నేపధ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో దాదాపు అందరు జనవరి 26న సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది అని చెప్పుకొచ్చారు. కానీ, ఎవరూ ఊహించని విదంగా జనవరి 20న సాలార్ ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నామంటూ ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ. అన్నట్లుగానే స్ట్రీమింగ్ కూడా మొదలుపెట్టింది. 

ఇక అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీకి రావడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. శనివారం(జనవరి 20) అర్ధరాత్రి నుండే సలార్ స్ట్రీమింగ్ మొదలు కావడంతో ఏ ఇంట్లో చూసినా, ఏ టీవీలో చూసిన సలార్ క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. అవి స్క్రీన్ షాట్స్ తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఆడియన్స్. దాంతో ఓటీటీలో రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధిస్తూ దుమ్ములేపుతోంది సలార్. ఇవన్నీ చూస్తుంటే ఓటీటీలో కూడా సలార్ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.