ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సలార్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సలార్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas), కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబోలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఇంటరెటైనేర్ సలార్(Salaar). భారీ అంచనాల మధ్య డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా రోజుల తరువాత ప్రభాస్ నుండి వచ్చిన యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాధించింది ఈ మూవీ. ప్రపంచవ్యప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల మార్క్‌ను దాటి ప్రభాస్‌ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న సలార్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ న్యూస్ కి పులిష్టాప్ పెడుతూ.. సలార్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను జనవరి 20 నుండి నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

నిజాంనికి జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ సినిమా ఓటీటీకి వస్తుందని అనుకున్నారు ఆడియన్స్ కానీ.. ఎవరూ ఊహించిన విదంగా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. మరి థియేటర్స్ లో కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.