రికార్డ్ ధర పలికిన సలార్ OTT రైట్స్.. ఆ క్రేజ్ ఏంది సామీ!

రికార్డ్ ధర పలికిన సలార్ OTT రైట్స్.. ఆ క్రేజ్ ఏంది సామీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, వీడియో స్ కూడా ఉంటడంతో.. ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమాపై హైప్ చూస్తుంటే.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలు పూర్తిగా మారిపోయేలా కనిపిస్తున్నాయి. జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ సునామి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఈ సినిమా.

రిలీజ్ కు ముందు లెక్కలతోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే.. సలార్ సినిమా ఓటీటీ హక్కులు భారీ రేట్ కు అమ్ముడయ్యాయట. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.160 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారట. ఇవన్నీ చూస్తుంటే సలార్ సినిమాపై ఏ రేంజ్ అంచనాలున్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతోంది.

ఇక సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హొంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.