సలార్ OTT అప్డేట్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్ కానీ.. అసలు విషయం చెప్పలేదు

సలార్ OTT అప్డేట్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్ కానీ.. అసలు విషయం చెప్పలేదు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. మళయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషించాడు. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. డిసెంబర్‌ 22న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సారికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కొంతకాలంగా సరైన హిట్టులేక సతమతమవుతున్న ప్రభాస్ కు సలార్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. 

ఇక సలార్ సినిమా విడుదలై దాదాపు నెల గడుస్తుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది నెట్ఫ్లిక్స్ సంస్థ. సలార్‌ త్వరలోనే ఓటీటీకి రానుంది అంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఖాన్సార్ ప్రజలు సంబరాలు మొదలుపెట్టొచ్చు. వాళ్ల సలార్ తిరిగి రాజ్యానికి వచ్చాడు. సలార్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.. అంటూ రాసుకొచ్చింది. కానీ, ఎప్పటినుండి స్ట్రీమింగ్‌ కానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.