Salaar Worldwide Collections: రూ.400 కోట్లకు చేరిన సలార్ కలెక్షన్స్

Salaar Worldwide Collections: రూ.400 కోట్లకు చేరిన సలార్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్ (Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు..బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది.

సలార్ మూవీ విడుదలైన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.402 కోట్లు సాధించినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సలార్ కలెక్షన్స్ పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తోన్నారు. దీంతో మేకర్స్ నుంచి పోస్టర్ రిలీజ్ అవ్వడంతో..రెబల్ హవా..ఇక ఖాన్సర్ మాత్రమే కాదు..బాక్సాపీస్ కూడా వసూళ్లతో ఎరుపెక్కబోతోంది అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

సలార్ కలెక్షన్స్ విషయానికి వస్తే..

సలార్ మూవీ తొలిరోజు ఏకంగా రూ.178 కోట్లు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.117 కోట్లు, ఇక నిన్న ఆదివారం రూ.107 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక సలార్' 4వ రోజు కలెక్షన్ కూడా సూపర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు, ఎందుకంటే ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్‌లో రూ. 20 కోట్లకు పైగా సంపాదించింది ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేకాకుండా ఇవాళ క్రిస్మస్ సెలవు కావడంతో..ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్లో ముందు భారీగా క్యూలో నిలుచున్నారు. ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ తో పాటు,సినీ సెలబ్రెటీలను కూడా సినిమాను థియేటర్స్ లో చూసి ఖుషీ అవుతున్నారు.