ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది

ఇండియన్ సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్ లలో సలార్(Salaar) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ తోపాటు, ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కేజిఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

ఇక డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇందులో భాగంగా సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. నిజానికి చాలా కాలంగా సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తాజా సమాచారం ప్రకారం సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1న చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక సాలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజిఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. మరి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.