Salaar Action Promo: దేవుళ్లు ఎట్లైనా రారన్నావు కదనే.. సలార్ ఊర మాస్ యాక్షన్ ప్రోమో

Salaar Action Promo: దేవుళ్లు ఎట్లైనా రారన్నావు కదనే.. సలార్ ఊర మాస్ యాక్షన్ ప్రోమో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం సలార్(Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురుంచే చర్చ నడుస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ స్నేహానికి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

లేటెస్ట్గా ఈ సలార్ నుంచి అదిరిపోయే ఊర మాస్ యాక్షన్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. దేవుళ్లు ఎట్లైనా రారన్నావు కదనే..అందుకే ఇటు తిరిగి మొక్కుతున్న..రాక్షసుడన్నా వత్తడేమో అని సురభి డైలాగ్తో రిలీజ్ చేసిన యాక్షన్ ప్రోమో గూస్బంప్స్ తెప్పిస్తోంది. ప్రభాస్ లో రాజసం..రాక్షసం..భీకరమైన గంభీరం..యా..యా అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ థీమ్.. ఇవన్నీ కూడకట్టుకుని చేసిన పోరాట సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. 

రెండు పార్టీలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని టైటిల్ పెట్టి..సక్సెస్ ను అందుకున్నారు. ఇక రెండో పార్ట్ కోసం పార్టీ 1 చివర్లో అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.రాబోయే రెండు పార్ట్ కు శౌర్యంగ పర్వం అని టైటిల్ ఫిక్స్ చేశారు.ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.