Spirit: ప్రభాస్-సందీప్ వంగా స్పిరిట్..ఎవరిదో తెలుసా?

Spirit: ప్రభాస్-సందీప్ వంగా స్పిరిట్..ఎవరిదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ షూటింగ్ దశలో ఉన్న కల్కి మూవీతో పాటు మారుతి డైరెక్షన్ లో ఒకటి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్(Spirit) చేస్తున్నారు. లేటెస్ట్గా స్పిరిట్ మూవీ నుంచి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. స్పిరిట్ మూవీ అర్జున్ రెడ్డిలో చూపించిన డ్రగ్స్ కంటే 90% పవర్ ఫుల్ డ్రగ్స్ మాఫియాను సందీప్ వంగా చూపించబోతున్నట్టు సమాచారం.

అంతేకాకుండా..ఆడియన్స్ దృష్టి కూడా సందీప్ వంగా స్పిరిట్ మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నారు. స్పిరిట్ మూవీని టీసిరీస్  తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు నిర్మాణ భాగస్వామి ఎవరనేది క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది? స్పిరిట్ సినిమా తెలుగు  తెలుగు హక్కులు యువి సంస్థ చేతుల్లో ఉన్నట్లు ముందుగా అందరూ అనుకున్నారు..మేకర్స్ కూడా అలాగే ప్రకటించారు.

కానీ ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ టైమ్ లో పూర్తి లెక్కలు మారాయి. ఎందుకంటే, ఆదిపురుష్ సినిమా హక్కులను పీపుల్స్ మీడియా(People Media Factory) తీసుకున్నపుడు, దాంతో పాటే సందీప్ వంగా స్పిరిట్ కూడా కలిపి ఇచ్చినట్లు టాక్ వినిపించింది. అందువల్ల స్పిరిట్ తెలుగు హక్కులు పీపుల్స్ మీడియా వాళ్ళకే కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్పిరిట్ కొన్న నిర్మాతలకు రూ.1000 కోట్ల మార్క్ ను చేరుకోవడం చాలా ఈజీ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

యానిమల్ సినిమాతో సందీప్ వంగా తనలోని ఇంటెన్స్ యాంగిల్ ను చూపించడమే స్పిరిట్ మూవీ హై లెవెల్ బిజినెస్కి ప్రధానమైన కారణం..అంటూ సినీ విశ్లేషకులు చెపుతున్నారు.