ది రాజా సాబ్గా ప్రభాస్.. లుంగీలో మాస్ లుక్ అదిరిపోయింది

ది రాజా సాబ్గా ప్రభాస్.. లుంగీలో మాస్ లుక్ అదిరిపోయింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా, క్రేజీ డైరెక్టర్‌ మారుతి(Maruthi) ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే షూటింగ్ కూడా మొదలెట్టేశారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అందుకే ఈ సినిమా అప్డేట్స్ గురించి ప్రభాస్ అభిమానులు ఈగర్ గావెయిట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సంక్రాంతి కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రభాస్- మారుతి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ది రాజాసాబ్‌ అనే టైటిల్‌ ఖారారు చేశారు. ఈ టైటిల్ తో వచ్చిన ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ నెక్స్ట్ లెవల్లో ఉంది. ప్రభాస్ ఫుల్ ఆన్ ఎనర్జిటిక్ మోడ్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలే ఏర్పడుతున్నాయి. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.