ప్రభాస్ బర్త్‌డేకు ‘ఫౌజీ’ గ్లింప్స్ ట్రీట్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

ప్రభాస్ బర్త్‌డేకు ‘ఫౌజీ’ గ్లింప్స్ ట్రీట్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’.   హను రాఘవపూడి రూపొందిస్తున్న  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ అనుకున్న షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షూట్ మొత్తం కంప్లీట్ కాకపోవడంతో  రిలీజ్ డేట్ విషయంలో భారీ మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. మొదట ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 3న విడుదల చేయాలని భావించారు. కానీ  క్లైమాక్స్ చిత్రీకరణకు మరింత సమయం పడుతుండటంతో వచ్చే ఏడాది మార్చి 18కి వాయిదా వేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

 మరోవైపు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. ఆయన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్పెషల్  గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియోలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో   ప్రభాస్  సైనికుడి పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇమాన్వి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుంది.  మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద  కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.