Prabhas Fauzi poster: రక్తపు మరకలతో ప్రభాస్! 'ఫౌజీ' పోస్టర్‌లో అసలేం ఉంది?

Prabhas Fauzi poster: రక్తపు మరకలతో ప్రభాస్! 'ఫౌజీ' పోస్టర్‌లో అసలేం ఉంది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇండిపెండెన్స్ డే రోజున అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. లేటెస్ట్ గా మోస్ట్ అవైటెడ్ వార్ యాక్షన్ లవ్ స్టోరీ 'ఫౌజీ' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీజర్, గ్లింప్స్ వస్తాయని ఆశించిన అభిమానులకు పోస్టర్ మాత్రమే ఇచ్చినా.. అందులో దాచిన ఎలివేషన్ మాత్రం సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఇది మామూలు సినిమా కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పోస్టర్‌లో ఓ వైపు గాంధీ వేషధారణలో ఉన్న వృద్ధుడు చార్మినార్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. మరోవైపు రక్తపు మరకలతో ప్రభాస్ రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని కనిపించాడు. అయితే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ ముఖాన్ని మేకర్స్ రివీల్ చేయలేదు. దీంతో అసలు ఈ పాత్ర ఎవరు? ఆ రక్తపాతం వెనుక కథేంటి? అనే ప్రశ్నలు మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. 

'స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంతా సంబరాలు చేసుకున్నారు. కానీ దానికంటే ముందు పెద్ద యుద్ధమే జరిగింది. రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడికి సెల్యూట్' అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా కథపై కొత్త ఊహాగానాలకు తెరలేపింది. పోస్టర్ చూస్తుంటే ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాకుండా.. చరిత్ర, దేశభక్తి, ప్రేమ, త్యాగం మేళవించిన ప్రీ-పీరియాడికల్ కథగా కనిపిస్తోంది.

'సీతారామం'  తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె. ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

డిసెంబర్ 3న థియేటర్లలోకి రానున్న 'ఫౌజీ'పై మరో ఆసక్తికర అంశం కూడా వైరల్ అవుతోంది. చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్ డీపీ మార్చని ప్రభాస్.. తాజాగా 'ఫౌజీ' పోస్టర్‌ను తన డీపీగా పెట్టుకోవడం అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది. ముఖం దాచిన ప్రభాస్.. కథ మాత్రం ఓపెన్ చేసి వదిలేశాడా? సమాధానం తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే..