రాజాసాబ్..  స్ట్రాంగ్ వార్నింగ్.. జూన్ 16న టీజర్‌‌‌‌‌‌‌‌

రాజాసాబ్..  స్ట్రాంగ్ వార్నింగ్.. జూన్ 16న టీజర్‌‌‌‌‌‌‌‌

ప్రభాస్‌‌‌‌ హీరోగా నటిస్తున్న వరుస పాన్‌‌‌‌ ఇండియా సినిమాల్లో ‘రాజా సాబ్‌‌‌‌’ ఒకటి.   మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  ప్రభాస్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్ హారర్ జానర్‌‌‌‌‌‌‌‌లో  నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. జూన్ 16న ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్‌‌‌‌గా అప్‌‌‌‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌‌‌‌కు లీకుల బెడద మొదలైంది. టీజర్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

దీనిపై రియాక్ట్ అయిన టీమ్.. లీక్ కంటెంట్‌‌‌‌ను షేర్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా ‘రాజా సాబ్’కు సంబంధించిన వీడియోలు లీక్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్‌‌‌‌ను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.  అత్యద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను  అందించడానికి తాము  ఎంతో కష్టపడుతున్నామని, దీనికి అందరూ సహకరించాలని  కోరారు.

ఈ సందర్భంగా సెట్‌‌‌‌లోని వర్కింగ్‌‌‌‌ స్టిల్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో ప్రభాస్‌‌‌‌తో పాటు దర్శకుడు మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు.. కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’ అని ఈ ఫొటోకు మారుతి క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.  నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రానికి  తమన్ సంగీతం అందిస్తున్నాడు.  డిసెంబర్ 5న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఈ సినిమా విడుదల కానుంది.