దిమాకీ బనో.. బేవకూఫ్ నహీ ప్రధాని వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

దిమాకీ బనో.. బేవకూఫ్ నహీ  ప్రధాని వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

ప్రధాని మోదీ ఉపయోగించిన ‘దిమాకీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్​గా ‘‘దిమాకీ బనో.. బేవకూఫ్ నహి. సవాల్ కరో.. గులామి నహి” అని ప్రకాశ్​రాజ్ ట్వీట్ చేశారు. ‘మూర్ఖులుగా లేదా అంధభక్తులుగా కాకుండా, ఆలోచించే బుద్ధిమంతులుగా ఉండండి. బానిసత్వంలో ఉండకుండా ధైర్యంగా నిలదీయండి, ప్రశ్నించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.


బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాకీ నక్సల్స్’ పదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ లో స్పందించారు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించే వారిని అలా పిలవడం సరికాదని పేర్కొంటూ ఆయన పెట్టిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘జస్ట్ ఆస్కింగ్’.. అంటూ ఎక్స్ లో తరచూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రకాశ్ రాజ్.. ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్​గా ‘‘దిమాగి బనో.. బేవకూఫ్ నహి. సవాల్ కరో.. గులామి నహి” అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా.. ‘మూర్ఖులుగా లేదా అంధభక్తులుగా కాకుండా, ఆలోచించే బుద్ధిమంతులుగా ఉండండి. బానిసత్వంలో ఉండకుండా ధైర్యంగా నిలదీయండి, ప్రశ్నించండి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బయటపెడుతున్న వాలంటీర్లను విమర్శించడాన్ని తప్పుపడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.