Hanuman Overseas: అమెరికాలో హనుమాన్ జోరు..చరణ్, ప్రభాస్ రికార్డ్ బ్రేక్

Hanuman Overseas: అమెరికాలో హనుమాన్ జోరు..చరణ్, ప్రభాస్ రికార్డ్ బ్రేక్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(PrasanthVarma), హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ (HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రాబడుతోంది హనుమాన్ మూవీ. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాలకు సైతం రాని కలెక్షన్స్ హనుమాన్ సాధిస్తోంది. లెక్కల్లో కొత్త లెక్కలు సెట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆడియన్స్ హనుమాన్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

ఇప్పుడు హనుమాన్ మూవీ వారం రోజులు కూడా గడవకుండానే యుఎస్ మార్కెట్లో కూడా తన సత్తా చాటింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ మార్కెట్లో ఆల్ టైం టాప్ 6 గ్రాసర్గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అమెరికాలో తాజాగా 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం టాప్ సిక్స్త్ టాలీవుడ్ గ్రాసర్ మూవీగా నిలిచిందని హనుమాన్ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్గా రన్ అవుతుండటం వల్ల..అతి త్వరలోనే 5వ ప్లేసులోకి వెళ్లేందుకు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 

యూఎస్ బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే..ఇప్పటివరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 28 డాలర్లు, ఆర్ఆర్ఆర్ 14.3 మిలియన్ డాలర్లు, ప్రశాంత్ నీల్ సలార్ 8.9 మిలియన్ డాలర్లు, త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో 3.6 మిలియన్ డాలర్లు, సుకుమార్ రంగస్థలం 3.5 మిలియన్ డాలర్లు సాధించాయి. ప్రస్తుతం హనుమాన్ మూవీ చరణ్ రంగస్థలం కంటే ఎక్కువ వసూలు చేసి టాప్ సిక్స్లో నిలిచింది. ఇక ప్రస్తుతం వచ్చేది సెకండ్ వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.