హనుమాన్ మూవీ ప్రభాస్తో ఎందుకు చేయలేదంటే: ప్రశాంత్ వర్మ

హనుమాన్ మూవీ ప్రభాస్తో ఎందుకు చేయలేదంటే: ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ(Tej Sajja) హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హనుమాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

ఇక హనుమాన్ ట్రైలర్ ఈవెంట్ లో మీడియాతో ముచ్చటించారు హనుమాన్ చిత్ర యూనిట్. అందులో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ.. హనుమాన్ ట్రైలర్ చూస్తుంటే భారీ స్కెల్ లో తెరకెక్కించారని అర్థమవుతోంది.. అంత పెద్ద సినిమాను ప్రభాస్ తో ఎందుకు ప్లాన్ చేయలేదు అని అడిగారు. దానికి సమాధానంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ప్రభాస్ ఆల్రెడీ పవర్ ఫుల్ హీరో. ఆయన బాడీ, ఆ కటౌట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన వేరే ఎవరు బయటినుండి పవర్ ఇవ్వాల్సిన అవసరంలేదు కానీ.. మా సినిమాలో హీరో ముందు చాలా అమాయకంగా ఉంటాడు. ఒకానొక సందర్భంలో అతనికి హనుమంతుడు శక్తిని ప్రసాదిస్తాడు. అందుకే ఈ సినిమాను ప్రభాస్ తో కాకుండా తేజ తో ప్లాన్ చేశామంటూ సాలిడ్ రిప్లయ్ ఇచ్చాడు. ప్రభాస్ గురించి ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.