ప్రెగ్నెన్సీలో ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా ఛాంలెంజ్లు ఎదుర్కొంటారు ఆడవాళ్లు. ముఖ్యంగా హర్మోన్స్ ఇన్ బాలెన్స్ వల్ల యాక్నె, దురద, పిగ్మెంటేషన్ వంటి స్కిన్ సమస్యలు ఇబ్బంది పెడతాయి వాళ్లని. రిలీఫ్ కోసం ఏమైనా ప్రాడక్ట్స్ కోని వాడదామన్నా అని ఎంతవరకు సేఫ్ అనేది చెప్పడం కష్టం. అందుకే వీలైనంత వరకు నేచురల్‌గా ఈ సమస్యల్ని తగ్గించుకోవాలి. తొమ్మిది నెలలు కచ్చితంగా ఈ బ్యూటీ రోటిన్ ఫాలో కావాలి అంటున్నా డెర్మటాలజీ నిపుణులు. మరి ప్రెగ్నిన్సీ టైంలో ఎలాంటి ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలో ఈస్టోరీలో తెలుసుకుందాం. . !
ప్రెగ్నెన్సీలో చర్మానికి రక్త సరఫరా వేగవంతం అవుతుంది. దీనివల్ల చర్మం దురద పుడుతుంటుంది చాలామందికి. ముఖ్యంగా పొట్ట దగ్గర దురద మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్ కి బదులు కలబంద గుజ్జు, కొబ్బరి, బాదాం నూనెల్ని పొట్ట దగ్గర రాయాలి. దీనివల్ల దురద తగ్గడమే కాదు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
దురద భరించలేక చాలామంది గోళ్లతో చర్మాన్ని గీకుతారు. దాంతో ఒళ్లంతా స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. అవి కూడా రొమ్ము, పొట్ట భాగంలో ఎక్కువగా పడతాయి. వీటిని, తగ్గించాలంటే టోపికల్ క్రీమ్స్ రాయాలి. ఆలివ్, కొబ్బరి నూనెల్ని కూడా నేచురల్ మాయిశ్చరైజర్స్ గా వాడొచ్చు..
చర్మం మీద జిడ్డు మొటిమలు ఉంటే గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. టోపికల్ ఎరిత్రోమైసిన్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. అయితే ఏ ప్రొడక్ట్ అయినా డాక్టర్ సలహా తీసుకున్న తరువాతే వాడాలి..
చర్మంపై మృత కణాల్ని తొలగించడానికి వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్స్ వాడాలి. అలాగే ఫేస్ వాష్ పూలు, పండ్లతో తయారైన ఫేస్ ప్యాక్లు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల చాలామందికి పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. అంటే చెంపలు నుదురు, మెడ, చంకల్లో చర్మం నల్లబడటం లేదా ఎరుపు, బ్రౌన్, గ్రే రంగులో మచ్చలు, ప్యాచ్లు రావడం అన్నమాట. వీటిని కంట్రోల్ చేయడానికి రోజుకి నాలుగుసార్లు నిమ్మరసంలో, కీరా జ్యూస్ కలిపి మచ్చలు,ప్యాచ్ లపై రాయాలి. తేనె, ఓట్స్ ఫేస్ మాస్క్ కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి. పచ్చి పాలల్లో పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకున్నా ఈ సమస్య తగ్గుతుంది.
ప్రెగ్నెన్సీలో శరీరానికి ఎక్కువ ఎండ తగిలితే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.. దానివల్ల పిగ్మెంట్ సెట్స్ యాక్టివ్ అయి ముఖంపై మచ్చలు వస్తాయి. అందుకే యూవీవె, యూవీబి కిరణాల నుంచి తప్పించుకోవడానికి రోజూ ఎస్పీఎఫ్-15 రాయాలి. అయితే. ప్రెగ్నెన్సీ మొదటి ఆరువారాల్లో అక్సిబెంజోస్. అక్టోకిలిస్, ఆక్షినలేట్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడకూడదు.
ఈ టైంలో చాలామంది ఆడవాళ్లని డ్రై స్కిన్ ఇబ్బంది పెడుతుంది. దాంతో పాటు పెదాలు కూడా పగులుతాయి. ఇలాంటప్పుడు పాల మీగడ, కొబ్బరి, గోధుము బిగుతు దుస్తులు గింజల నూనెని ముఖానికి, పెదాలకి రాయాలి. రొమ్ముకి కూడా కొబ్బరినూనె రాయొచ్చు. గర్భిణీలు విటమిన్-సి సీరము లు వాడితే స్కిన్ మెరుస్తుంది. ఇది యాంటీ అక్సిడెంట్ గా పనిచేసి కణాలనీ రిపేర్ చేస్తుంది కూడా.
ప్రెగ్నెన్సీలో బిగుతు దుస్తులు రాషిస్ కి కారణమవుతాయి. పర్ఫ్యూమ్స్, లోషన్స్, కెమికల్స్ ఉన్న సబ్బులు వాడొద్దు. అలాగే రెటినాల్ సాలిసిలిక్ ఆమ్లం హైడ్రోక్వినోన్ ప్రొడక్ట్స్ ని బిడ్డను కనేవరకు అంటే.. తొమ్మది నెలలు పూర్తిగా దూరం పెట్టాలి. వీలైనంత వరకు హెయిర్ స్టేటనింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే స్ట్రైటనింగ్ కర్లింగ్ కోసం వాడే ప్రొడక్ట్స్ లో అమ్మోనియం థియోగ్లైకోలేట్ ఉంటుంది. నెయిల్ పాలిష్ కూడా వద్దేవద్దు. పారబెన్ స్ట్రాగ్రెన్స్ ఆల్కహాల్, సువాసనలు లేని ప్రొడక్ట్స్ వాడాలి.
