ప్రేమలో.. పాపలు బాబులు

ప్రేమలో.. పాపలు బాబులు

అభిదేవ్ హీరోగా శ్రీరాజ్ బల్లా దర్శకత్వంలో విజయ మాధవి బల్లా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో..’. పాపలు బాబులు అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మురళీ మోహన్ మాట్లాడుతూ ‘టైటిల్ కొత్తగా ఉంది. అలాగే కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. 

నటుడు సమీర్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరో అభిదేవ్, డీవోపీ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా తదితరులు పాల్గొన్నారు.