ప్రేమలో మూవీ ట్రైలర్ లాంచ్

ప్రేమలో మూవీ ట్రైలర్ లాంచ్

చందు కోడూరి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలో’. చరిష్మా  శ్రీఖర్ హీరోయిన్. శివాజీరాజా, మధుసూదన్ రావు ఇతర పాత్రలు పోషించారు. రాజేష్ కోడూరి నిర్మించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. చందు మాట్లాడుతూ ‘హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేయడం చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించినా, అందరి సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించా.  

ఇందులో భారీ తారాగణం, ఎలివేషన్స్,  టెక్నీషియన్స్ లేరు.. కానీ భారీ ఎమోషన్స్ ఉన్నాయి. కథలో బలం ఉంది.. కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌లో దమ్ముంది. ఎమోషన్స్ పండించాలంటే బడ్జెట్ ఉండాల్సిన పని లేదని నిరూపించాం’ అని చెప్పాడు. చందు పడ్డ కష్టానికి ఈ చిత్రం విజయం సాధించాలని కోరారు శివాజీ రాజా. నటుడు భోగిరెడ్డి శ్రీనివాస్, సంగీత దర్శకుడు సందీప్, లిరిక్ రైటర్ సత్య పాల్గొన్నారు.