'ప్రేమలు' సినిమాతో కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో రచ్చ చేస్తోంది. ఇటీవల సూర్య మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకులను పలకరించి హిట్ కొట్టింది ఈ భామ. ఇప్పుడు వారం తిరిగేసరికే మరో డిఫరెంట్ లవ్ స్టోరీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ట్రైలర్ రిలీజ్..
మలయాళంలో రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' సినిమా. ఇప్పుడు తెలుగులోకి 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'పేరుతో సెప్టెంబర్ 4న గ్రాండ్ గా తీసుకొస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్
'ప్రేమలు'వంటి బ్లాక్ బస్టర్ అందించిన సెన్సేషనల్ డైరెక్టర్ గిరీష్ ఏడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతాన్, శ్యామ్ పుష్కరన్ వంటి అగ్ర నిర్మాతలు సంయుక్తంగా నిర్మించారు. మలయాళంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తెలుగు ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
కథ విషయానికొస్తే..
ఇదొక డిఫరెంట్ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ. డైనమైట్ పెట్టి బద్దలు కొట్టాలన్నా కరగని బండరాయి లాంటి జస్టిన్ (నివిన్ పౌలీ) పక్కింట్లోకి ఆష్లే (మమితా బైజు) కుటుంబం అద్దెకు వస్తుంది. జస్టిన్ కంటే ఆష్లే ఏకంగా 12 ఏళ్లు చిన్నది. ఈ జెన్‌జీ అమ్మాయి తన అల్లరి, ప్రేమతో ఆ బండరాయి లాంటి మనసును ఎలా కరిగించిందనేదే మెయిన్ పాయింట్. అయితే మిగతా ప్రేమికుల్లా ఓపెన్ గా తిరగాలని ఆష్లే ఆశపడితే.. 'మన ప్రేమ గురించి ప్రపంచంలో ఏ ఒక్కరికీ తెలియకూడదు, సీక్రెట్ గా లవ్ చేసుకుందాం' అని కండిషన్ పెడతాడు జస్టిన్. మరి ఈ దాగుడుమూతల ప్రేమాయణం ఏ తీరానికి చేరింది? 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ ఎలా ఆకట్టుకున్నారనేది థియేటర్లో చూడాల్సిందే..
విష్ణు విజయ్ అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్, నివిన్ పౌలీ-మమితా కాంబోలోని వింటేజ్ రొమాన్స్ తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 4న ఈ క్యూట్ లవ్ స్టోరీ థియేటర్లలో సందడి చేయనుంది. మరి మలయాళంలో రికార్డులను... తెలుగులో కూడా సాధిస్తుందో లేదో చూడాలి ..
