నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోడీ

నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోడీ

ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని  ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని మోడీని ప్రశంసించారు. ఆయన ప్రపంచానికి చేస్తున్న సేవలను కొనియాడారు. యుద్ధాలు చేసే దేశాల చేత కూడా యుద్ధాలను ఆపించగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నారు. మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు. 

మోడీ విధానాల వల్ల భారత్ సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని అస్లే అన్నారు. ప్రపంచాన్ని నడపగల గొప్ప అర్హత ఉన్న  నాయకుడైన ప్రధాని మోడీ.. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే అది చారిత్రాత్మకం అవుతుందని చెప్పారు.