EXCLUSIVE Prithviraj Sukumaran: సలార్ సినిమా నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో తీస్తా

EXCLUSIVE Prithviraj Sukumaran: సలార్ సినిమా నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో తీస్తా

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆయా తరుణం మరో రెండ్రోజుల్లో వస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ గమనిస్తున్నారు. మేకర్స్ కూడా సలార్ ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అన్నట్లు వరుస ఇంటర్వూస్ తో బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా సలార్ స్నేహం..అదేనండీ వరదరాజ్ మన్నార్గా నటించిన మలయాళ స్టార్ డైరెక్టర్, యాక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక విషయాలు పంచుకున్నారు. 

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సినిమాను..డైరెక్టర్ అయిన మీరు తెరకెక్కిస్తే ఎలా ఉంటోంది? ఒకవేళ ఇదే సినిమాను మరో డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. ఎవ్వరి విజన్ వారిది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తన మార్క్ ని చూపించారు.ఇక తను సలార్ సినిమాని డైరక్ట్ చేసే అవకాశం వస్తే మాత్రం..మరో లెవెల్లో డిఫరెంట్ గా ఉంటుందని తెలిపారు. 

అంతేకాకుండా..సలార్ సినిమాను ఐదుగురి డైరెక్టర్స్ కి ఇస్తే ఐదు రకాలుగా తెరకెక్కిస్తారు. నాకు అవకాశం ఇస్తే నేను సలార్ ను నా స్టైల్ లో మరింత డిఫరెంట్ గా తీస్తాను. ఎందుకంటే ప్రశాంత్ తీసిన సలార్ చూశాను. చాలా బాగా తీశాడు. ఇందులో సలార్ ప్రభాస్ తో వచ్చే సీన్స్ చాలా అద్భుతమైన డ్రామా క్రియేట్ చేశాడని..ఇక ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ కూడా అదే అంటూ పృధ్వీరాజ్ వెల్లడించారు.

అలాగే, ఈ సినిమా పేపర్ పై కంటే, తెరపైకొచ్చిన తర్వాత ఇంకా బాగుందంటున్నాడు. ఇద్దరు స్నేహితుల మీద ప్రశాంత్, సినిమా తీస్తాడని తను కలలో కూడా ఊహించలేదన్నాడు.

పృథ్విరాజ్ ప్రస్తుతం మలయాళ స్టార్ మోహన్ లాల్తో లూసిఫర్ రీమేక్ను (L2) తెరకెక్కిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్..రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.