Prithviraj Sukumaran: ప్రభాస్‍ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్ధమైంది

Prithviraj Sukumaran:  ప్రభాస్‍ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్ధమైంది

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్(Salaar) సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతుంది. దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.

రీసెంట్గా పృథ్వీరాజ్ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్‍ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తనకు సలార్ సమయంలో అర్థమైందనే ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ని పృథ్విరాజ్ వెల్లడించారు. ఈ ప్రశ్న ప్రతి సినిమా ఆర్టిస్ట్కి, మేకర్స్కి, అంతేకాదండి..డార్లింగ్ అభిమానులకి కూడా చాలా సార్లే తట్టింది. 

ఇక స్టార్ పృథ్వీరాజ్కి డార్లింగ్కి అర్ధం ఎలా చెప్పడంటే..ప్రభాస్ చాలా త్వరగా నాకు స్నేహితుడినయ్యాయనని వివరించారు. “ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే అరుదైన గిఫ్ట్ ప్రభాస్ కు ఉంది. సెట్‍లో ఎప్పుడూ అందరి గురించి అతడు పట్టించుకునే విధానం..అలాగే అందరూ మంచి ఆహారం తినేలా..కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా ప్రతి ఒక్కరినీ చూసుకుంటుంటారు. ఇక అప్పుడు తెలిసింది ప్రభాస్ని అందరూ డార్లింగ్ అని ఎందుకు అంటారో' అని స్టార్ పృథ్విరాజ్ తెలిపారు.అంతేకాకుండా తాను తరచూ మెసేజ్‍లు చేసే అతితక్కువ స్నేహితుల్లో డార్లింగ్ ప్రభాస్ ఒకరని ఆయన తెలిపారు.

రీసెంట్గా రిలీజైనా సలార్ పార్ట్-1 సీజ్‍ఫైర్ ట్రైలర్లో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలా ఉంటుందోని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.ఈ మూవీలో దేవగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు.పృథ్విరాజ్ ప్రస్తుతం మలయాళ స్టార్ మోహన్ లాల్తో లూసిఫర్ రీమేక్ను (L2) తెరకెక్కిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్..రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్టు సమాచారం.