శ్రీదేవి బంగ్లా టీజర్: బోనీ కపూర్ ఏమంటాడో..?

శ్రీదేవి బంగ్లా టీజర్: బోనీ కపూర్ ఏమంటాడో..?

కన్ను గీటి కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. లవర్స్ డే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే మూవీలో నటిస్తుంది. ప్రశాంత్ మాంబుల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ శనివారం రిలీజైంది. నిమిషం 18 సెకన్లున్న ఈ టీజర్ లో.. ‘నాకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారో నీకు తెలుసా?’ అని ప్రియ ఓ యువకుడ్ని ప్రశ్నిస్తున్న డైలాగ్‌ తో ప్రారంభమైంది. ‘ప్రపంచం మొత్తం నీ నగ్న జీవితాన్ని చూస్తుంది’ అని ఆమెను ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ సినిమాపై ఇటీవల బోనీ కపూర్ సీరియస్ అయ్యాడు. శ్రీదేవీ లైఫ్ ను కాంట్రవర్సీ చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోపై ఎలా స్పందిస్తారో చూడాలి.