
‘ఒరు అడార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ నేషనల్లెవల్లో ట్రెండింగా మారింది. ఒక్క కన్ను గీటిన వీడియో ఆమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మార్చింది. ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ అవకాశాలతో దూసుకుపోతోంది. అయితే, తాను మాత్రం ఏరోజు నటిని కావాలని అనుకోలేదని ప్రియా తెలిపింది.
కాలేజీలో ఉన్నప్పుడు ఓ ఆడిషన్లో సరదాగా పాల్గొన్నట్టు తెలిపింది. అది తనకు హీరోయిన్ ఛాన్స్ అందించడమే కాకుండా ఇంతటి గుర్తింపునిచ్చిందని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు అద్దం ముందు నిల్చుని సినీ తారల గెటప్స్ డైలాగులను అనుకరించేదాన్నని ప్రియా తెలిపింది. కానీ, భవిష్యత్తు తనకోసం ఇలాంటి సప్రైజ్ దాచి ఉంచుతుందని ఊహించలేదంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.