Save The Tigers 2 Trailer: భార్య బాధితులైన..ముగ్గురు మొనగాళ్లు మళ్లీ వస్తున్నారు

Save The Tigers 2 Trailer: భార్య బాధితులైన..ముగ్గురు మొనగాళ్లు మళ్లీ వస్తున్నారు

ప్రియదర్శి, కృష్ణ చైతన్య, అభినవ్ గోమఠం,'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్((Save The Tigers Season 1). ఈ సీరిస్ ఆడియన్స్కు భలే కిక్కిచ్చింది. చూస్తున్నంత సేపు ప్రతి సీన్లో నవ్వుకునేలా తెరకెక్కించారు మేకర్స్. ఓటీటీలో ఫస్ట్ సీజ‌న్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్, సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం సెకండ్ సీజన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్, సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సమయం ఆసన్నమైంది. 

లేటెస్ట్గా సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (Save The Tigers Season 2) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ  సిరీస్లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని..కపుల్స్గా ప్రధాన పాత్రల్లో కనిపించారు. రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది.

 జైలు సీన్తో మొదలైన ట్రైలర్..ఫ్యామిలీ క్యూట్ గొడవలతో అదిరిపోయింది. దీంతో ఈసారి కూడా సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఫుల్గా ఆడియన్స్ని నవ్వించేలా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మార్చి 15 నుంచి సేవ్ ద టైగర్స్ సీజన్ 2 డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సీరిస్లో శ్రీకాంత్ అయ్యంగార్, వేణు, రోహిణి..మరికొంతమంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు యాత్ర డైరెక్టర్ మ‌హి వి. రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క్రియేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించగా..తేజా కాకుమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 

సేవ్ ద టైగర్స్ సీజన్ 1 విషయానికి వస్తే.. 

భార్య బాధితులైన ముగ్గురి యువకుల కథే ఇది. భార్యా,భర్తల మధ్య సహజంగా వచ్చే  చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలు, అభిప్రాయ బేధాలు ఇవే ఈ సిరిస్ ఈ నేపథ్యం. ఇలాంటి పాయింట్ తో తెలుగులో ఇప్పటికి చాలా సినిమాలే వచ్చాయి. కానీ..వాటికీ ఈ సిరీస్ కి తేడా ఏంటంటే? ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.

ప్రసెంట్ జనరేషన్ జంటల మధ్య రెగ్యులర్గా ఉండే పరిస్థితులకి కాసింత వినోదాన్ని జోడించి చాలా చూపించారు. అందుకే.. సినిమా చూసే ఎవరైనా ఈజీ గా కనెక్ట్ అవుతారు. వాళ్ళని వాళ్ళు ఈ కథతో రిలేట్ చేసుకుంటారు.సిరీస్ ఎంత సహజంగా ఉంటుందో.. కథలో సందేశాన్ని కూడా అంతే చక్కగా చూపించారు. కావలసినంత కామెడీ, కోరుకున్నంత సెటైర్, పదే పదే గుర్తొచ్చేంత ఫన్, ఊహలకు అందనంత డ్రామా.. అన్నీ కలిసిన ఒక సరికొత్త సిరీస్ సేవ్ ద టైగర్స్.