రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ స్టార్‌గా ముందుకెళ్తోన్న ఆమె.. తాజాగా ఓ క్రేజీ హాలీవుడ్ మూవీలో ఛాన్స్ అందుకుంది.
ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ రసెల్ క్రో హీరోగా నటిస్తున్న ‘బ్లూ ఫ్లై’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ‘ప్రెడెటర్’ ఫేమ్ నిమ్రోద్ అంటల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పెషల్ కమాండోగా యాక్షన్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ప్రియాంక ఇందులో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
కాంగోలోని దట్టమైన అడవిలో కూలిపోయిన విమానం జాడ కనిపెట్టే సీక్రెట్ మిషన్‌లో స్పెషల్ టీమ్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బీస్ట్, అండర్‌వాటర్ లాంటి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫేమ్ అర్లాంబో బ్లూమ్స్‌తో కలిసి ఓ థ్రిల్లర్, నికోలస్ స్టోలర్ తీస్తున్న ‘జడ్జిమెంట్’, మీరా నాయర్ తీస్తున్న ‘అమ్రి’తో పాటు ఏంజెలినా జోలీతో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తోంది.
