హనుమాన్ సూపర్ హిట్ అవ్వాలి.. తేజకు ఆధ్మాత్మిక ఉంగరం గిఫ్టుగా ఇచ్చిన నిర్మాత

హనుమాన్ సూపర్ హిట్ అవ్వాలి.. తేజకు ఆధ్మాత్మిక ఉంగరం గిఫ్టుగా ఇచ్చిన నిర్మాత

టాలీవుడ్ నుండి ఈ సంక్రాంతికి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలలో హనుమాన్(HanuMan) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కిస్తున్న ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా చేస్తున్నారు. మలయాళ బ్యూటీ అమృత అయ్యర్(Amritha Aiyer) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. హనుమాన్ లాంటి డివోషనల్ క్యారెక్టర్ తో వస్తున్న ఈ ఫిక్షనల్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. దీంతో ప్రేక్షకులు ఈ హనుమాన్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ప్రమోషన్స్ భాగంగా ఇటీవల హనుమాన్ హీరో తేజ సజ్జ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ను కలిశారు. ఇందులో భాగంగా హీరో తేజకు ప్రత్యేకమైన ఆధ్మాత్మిక ఉంగరం గిఫ్టుగా ఇచ్చారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ సంధర్బంగా హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సినిమా రిలీజై విజయం సాధించిన తరువాత ఇలాంటి గిఫ్టులు ఇస్తారు.. కానీ రిలీజ్ కు ముందే ఆధ్మాత్మిక ఉంగరం బహుమతిగా అందుకున్నారు హీరో తేజ.