ఒక దర్శకుడు.. ఇద్దరు మెగా హీరోలు.. మరి సినిమా ఎప్పుడు?

ఒక దర్శకుడు.. ఇద్దరు మెగా హీరోలు.. మరి సినిమా ఎప్పుడు?

ఒక్క దర్శకుడి కోసం ఇద్దరు మెగా హీరోలు వెయిట్ చేస్తున్నారట. ఆయన ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సినిమా చేయాడానికి సిద్ధంగా ఉన్నారట. కానీ ఆ దర్శకుడు మాత్రం వేరే హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఆ ఇద్దరు మెగా హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star allu arjun). 

ప్రస్తుతం బోయపాటి యంగ్ హీరో రామ్(Ram pothineni) తో స్కంద(Skanda) అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే బోయపాటి తరువాత సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇటీవల బోయపాటి తరువాత తమ బ్యానర్ లో ఉంటుందని నిర్మాత అల్లు అరవింద్(Allu aravind) హిట్ ఇచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం బోయపాటి నెక్స్ట్ సినిమాను మరోసారి బాలయ్య(Balayya)తో చేయనున్నారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఒక విలేకరి. 

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు అల్లు అరవింద్. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్.. బోయపాటి తరువాత సినిమా మీ బ్యానర్ లో అన్నారు, కానీ బయట మాత్రం బాలయ్యతో అంటున్నారు ఇందులో ఏది నిజం అని అడిగారు. దానికి సమాధానంగా అల్లు అరవింద్.. అది మీకు వినిపిస్తుందేమో మాకు కాదు. బోయపాటి తరువాత సినిమా మా బ్యానర్ లోనే ఉంటుంది. అడ్వాన్స్ కూడా ఇచ్చాము. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు మెగా హీరోయిలను ఆప్షన్ గా పెట్టుకున్నాము. అందులో ఎవరికి కథ సెట్ అయితే వాల్లతో బోయపాటి సినిమా ఉంటుంది. అని సమాధానం ఇచ్చారు. 

దీంతో ఆ ఇద్దరు మెగా హీరోలు ఎవరై ఉంటారు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఆ ఇద్దరిలో ఒకరు మెగా స్టార్ కాగా, మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరిలో ఎదో ఒక హీరోతో బోయపాటి తరువాత సినిమా ఉంటుందని అర్థమవుతోంది. మరి ఈ ఇద్దరిలో ఏ హీరో ఒకే అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.