Producer Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం..త్వరలో కలుస్తున్నాం

Producer Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం..త్వరలో కలుస్తున్నాం

హైద్రాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్( Allu Aravind) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని తెలిపారు.

ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమను ఎన్నో విధాలుగా తమ ప్రోత్సహంతో ముందుకెళ్ళాం అని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకు మా సినీ పరిశ్రమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అతి త్వరలోనే సినీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అల్లు అరవింద్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది