
ధమాకా(Dhaka) తర్వాత రవితేజ(Raviteja) హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం ఈగల్(Eagle). కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamaneni) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) మాట్లాడుతూ ‘ఈ చిత్రం క్లాసిక్ స్టైలిష్ మాస్ ఎంటర్‌టైనర్. కంటెంట్ చాలా బాగుంటుంది. రవితేజ కొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. కార్తీక్ గతంలో మా బ్యానర్‌లో కొన్ని చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు. ‘ధమాకా’ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. ‘ఈగల్’ను కార్తీక్ బాగా హ్యాండిల్ చేశారు. ఆడియెన్స్‌ను అలరించే అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నా.. రవితేజ గారి ప్రోత్సాహంతో చాంబర్ నిర్ణయాన్ని గౌరవించి పోస్ట్ పోన్ చేశాం. అయినా ఇప్పుడు గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం. రవితేజ గారితో మాకు మంచి రిలేషన్ ఏర్పడింది. అందుకే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే కార్తీక్‌తోనూ మరో సినిమా అనౌన్స్ చేస్తున్నాం. ఇక మా బ్యానర్ నుంచి ఏడాదికి మినిమం ఆరు సినిమాలు విడుదలవుతాయి.15 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా ఈటీవీ విన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. ఈ ఏడాది 50 చిత్రాల మైలురాయిని అందుకుంటామని భావిస్తున్నాం. ఫాస్టెస్ట్ హండ్రెడ్ సినిమాలు చేయడమే మా లక్ష్యం’ అని చెప్పారు.