వెంకటేష్ నాకు ఇష్టమైన హీరో : వెంకట్ బోయనపల్లి

వెంకటేష్ నాకు ఇష్టమైన హీరో : వెంకట్ బోయనపల్లి

వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ను నిర్మించే అవకాశం రావడం తన అదృష్టం అంటున్నారు  నిర్మాత వెంకట్ బోయనపల్లి.  శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ ‘వెంకటేష్ నాకు ఇష్టమైన హీరో. ఆయనతో సినిమా చేయాలని నా కోరిక.  నానితో ‘శ్యామ్ సింగరాయ్’ నిర్మిస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లోనే శైలేష్‌‌‌‌‌‌‌‌తో పరిచయం ఉంది. 

శైలేష్ చెప్పిన కథ వెంకటేష్ గారికి చాలా నచ్చింది. స్టోరీ చెప్పిన 24 గంటల్లోనే ప్రాజెక్ట్ ఓకే అవ్వడం సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఇది చాలా పెద్ద కథ. స్టోరీ డిస్కషన్‌‌‌‌‌‌‌‌లోనే  భారీ బడ్జెట్ మూవీ అనుకున్నాం. దానికి తగట్టుగా చాలా గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా నిర్మించాం.  నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా , శ్రద్ధ శ్రీనాథ్ లాంటి స్టార్ కాస్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందించాం.  సినిమా చూస్తున్నప్పుడు అందులోని అద్భుతమైన ఎమోషన్ కన్నీళ్లు తెప్పిస్తుంది. 

సినిమా చూసి బయటికి వస్తున్ననప్పుడు ప్రేక్షకుడి కళ్ళల్లో గొప్ప భావోద్వేగంతో కూడిన కంటతడి కనిపిస్తుంది.  ఇదొక న్యూ ఏజ్ యాక్షన్‌‌‌‌‌‌‌‌తో కూడిన మంచి ఫ్యామిలీ సినిమా.  యాక్షన్, ఎమోషన్ లార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేయాలని లేదు. ఇష్టమైన వ్యక్తులతోనే వర్క్ చేయాలనుకుంటా. నన్ను నిర్మాతను చేసిన నాని అంటే నాకు ఇష్టం. అలాగే వెంకటేష్ గారు ఎప్పట్నుంచో ఇష్టం. వీళ్లిద్దరి  కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో సినిమా చేయాలని నా డ్రీమ్. అది ఎవరు తీసినా ఎంజాయ్ చేస్తా’ అని చెప్పారు.