నిర్మాత కూడా చెప్పేశాడు.. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా?

నిర్మాత కూడా చెప్పేశాడు.. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా?

సలార్(Salaar) సినిమా రీమేక్.. కాదు కాదు ఒరిజినల్.. ట్రైలర్ చూడండి అచ్చం ఉగ్రం(Ugram) మూవీలానే ఉంది. ఇవి ప్రస్తుతం సలార్ మూవీపై వినిపిస్తున్న కామెంట్స్. నిజానికి సలార్ మూవీ మొదలై మొదటి పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుండి ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ ఉగ్రం కు రీమేక్ గా వస్తుందని కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కారణం ఈ రెండు సినిమాలకు దర్శకుడు ప్రశాంత్ నీల్ అవడం, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒకేలా ఉండటం. దీంతో సలార్ సినిమా ఖచ్చితంగా ఉగ్రం సినిమాకు రీమేక్ అని వార్తలు వినిపించాయి. 

అయితే ఈ వార్తలు దర్శకుడు ప్రశాంత్ నీల్ వరకు వెళ్లడంతో.. ఆయన కూడా స్పందించారు. సలార్ సినిమా ఒరిజినల్ కథతో వస్తుంది. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదు. ఈ కథ కేవలం ప్రభాస్ కోసం తయారు చేయబడింది అని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే రిలీజ్ దగ్గర పడుతుండటంతో మరోసారి సలార్ రీమేక్ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు. 

సలార్ మూవీపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. అవన్నీ బేస్ లెస్ రూమర్స్. సలార్ సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు. ప్రభాస్ కోసం ప్రశాంత్ ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. అవుట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రభాస్ ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా సలార్ లో చూస్తారు. ఆయన నుండి ఫ్యాన్స్ ఎం కోరుకుంటున్నారో అవన్నీ సలార్ లో ఉంటాయి. తప్పకండా  డిసెంబర్   22న సలార్ దెబ్బకు రికార్డ్స్ బద్దలవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ కిరగందూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.