స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్ట్

హైదరాబాద్ లోని పంజాగుట్టలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న  ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
20మందిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న వారిలో పది మంది మహిళలు, మరో పది మంది మగవాళ్లు ఉన్నారు. 

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలోని నవీన్‌నగర్‌లో ఏరోనాటిక్ బ్యూటీ స్పా పేరుతో పలు  ప్రాంతాల నుంచి యువతులను తీసుకు వచ్చి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో  టాస్క్ ఫోర్స్  పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో 20 మందిని అరెస్ట్ చేశారు.