Spark L.I.F.E: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్

Spark L.I.F.E: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్

విక్రాంత్, మెహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన భారీ బడ్జెట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్ లైఫ్ (Spark L.I.F.E ). గత నెల 17న రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. విక్రాంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే స్టోరి, స్క్రీన్ ప్లేను అందించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ హృదయం, ఖుషి చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించటం విశేషం. కోలీవుడ్ యాక్టర్ గురు సోమసుందరం ఇందులో విలన్‌గా నటించటం మరో విశేషం.

ఈ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ కి కొత్త ఇంటెన్స్ ఫీల్ ఇచ్చింది. అలాగే ఈ చిత్రం బావుందంటూ మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటి నుంచే ప్రేక్షకులు ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

స్పార్క్ లైఫ్ మూవీలో నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.