సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల.ఇల్లు కట్టేటప్పుడు ప్రతి విషయంలో వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి. కొత్తగా కట్టుకున్న ఇంట్లో పూజగది ఎక్కడ ఉండాలి. నైరుతి భాగంలో బెడ్ రూమ్ ఉండాలా.. స్టోర్ రూం ఉండాలా.. .. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .!
ప్రశ్న: కొత్తగా కట్టుకున్న ఇంటిలో పూజగదికి స్థలం లేకపోవడం వల్ల ఈశాన్యం మూల కిందివైపు చిన్నగా గది ఏర్పాటు చేసుకున్నాం. ఇది సరైందేనా?
జవాబు : ఈశాన్యంలో పూజగది ఉండకూడదు. ఇది సరైన నిర్మాణం కాదు. ఈశాన్యం మూల మూసిఉండే నిర్మాణాలు చేయొద్దు. పూజగదిని కొంచెం పక్కకు జరుపుకోవాలి. తూర్పు సెంటర్లో పూజ గది ఏర్పాటు చేసుకుంటే మంచిది.
ప్రశ్న: నైరుతి వైపు బెడ్రూమ్ లేదా స్టోర్ రూమ్... ఏది ఏర్పాటు చేసుకుంటే మంచిది
జవాబు : నైరుతి వైపు బెడ్ రూమ్, స్టోర్ రూమ్.. రెండింట్లో ఏదైనా కట్టుకోవచ్చు. అయితే, అటువైపు ప్రత్యేకంగా బాత్రూమ్ కట్టుకోకూడదు. దక్షిణ సెంటర్లో కామన్ బాత్రూమ్ ఉండొచ్చు. ఒకవేళ నైరుతి బెడ్రూమ్ లో బాత్రూమ్ కావాలంటే ఆగ్నేయం లేదా వాయువ్యంలో అయినా కట్టుకోవచ్చు.
