పెళ్లి చేసుకోబోతున్న పల్సర్ బైక్ రమణ.. అమ్మాయి ఎవరో తెలుసా?

పెళ్లి చేసుకోబోతున్న పల్సర్ బైక్ రమణ.. అమ్మాయి ఎవరో తెలుసా?

పల్సర్ బైక్ రమణ(Pulser bike Ramana) గురించి సోషల్ మీడియా యూజర్స్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో అనే పాటతో ఒక ఊపి ఒప్పేశాడు. ఈ పాత యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇదే పాటను రవితేజ హీరోగా వచ్చిన ధమాఖా సినిమాలో కూడా వాడేశాడు. ఆ పాట సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు పల్సర్ బైక్ రమణ. 

అయితే తాజా సమాచారం మేరకు పల్సర్ బైక్ రమణ ఓ ఇంటివాడు కాబోతున్నారట. కుందన శ్రీ (నందిని) అనే అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడట. డిసెంబర్ నెలలోనే వీరి నిశ్చితార్థం జరిగిందని సమాచారం. ఈ వేడుకకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.