Pushpa2 Item Song: బాలీవుడ్ బ్యూటీస్తో పుష్ప రాజ్ స్టెప్పులు

Pushpa2 Item Song: బాలీవుడ్ బ్యూటీస్తో పుష్ప రాజ్ స్టెప్పులు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)​ అల్లు అర్జున్​(Allu Arjun) కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక సమంత చేసిన స్పెషల్​ సాంగ్ ఊ అంటావా మావా ఏకంగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. సమంత హాట్ హాట్‌ స్టెప్పులతో..ఏ రేంజ్‌లో బాక్సాపీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు వస్తోన్న పుష్ప..ది రూల్‌( Pushpa The Rule) నుంచి మరో అదిరిపోయే ఐటంసాంగ్‌ రాబోతుంది. పుష్ప సీక్వెల్‌లో వచ్చే ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీస్ దిశాపటానీ అండ్ కృతిసనన్‌ పుష్ప రాజ్ తో చిందులేస్తున్నట్లు సమాచారం. దేవీశ్రీ ప్రసాద్​ మ్యూజిక్​ డైరెక్షన్​లో రానున్న ఈ హైఓల్టేజ్​ సాంగ్​ సమంత సాంగ్​ను మించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  

ప్రస్తుతం ఈ సాంగ్‌ను రామోజీఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పుష్ప రాజ్ మళ్లీ వస్తున్నాడు.. అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పుష్ప ద రైజ్ (Pushpa The Rise) ఫస్ట్ పార్ట్ మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన టైమ్ చూపిస్తే..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారని సమాచారం. పుష్ప ఫారెన్ కంట్రీస్ లో కూడా తన హవా ఎలా నడిపించాడో అన్నది చూపించబోతున్నారట సుకుమార్.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌,  జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌ కీ రోల్స్ లో నటిస్తున్నారు. బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు పుష్ప ది రూల్‌ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.