జిడ్డు చర్మానికి ఫుల్ స్టాప్.. వర్షాకాలంలో ముఖం మెరవాలంటే ఈ న్యాచురల్ టిప్స్ ట్రై చేయండి!

జిడ్డు చర్మానికి ఫుల్ స్టాప్.. వర్షాకాలంలో ముఖం మెరవాలంటే ఈ న్యాచురల్ టిప్స్ ట్రై చేయండి!

సీజన్లో చాలా మార్పులు వచ్చాయి. హ్యుమిడిటీ లెవల్స్ పెరగడంతో స్కిన్ ఎలర్జీలు రావడం, మొటిమలు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ముఖం జిడ్డుగా తయారవడం వల్ల స్కిన్ చాలా డల్ గా కనిపిస్తుంది. వానాకాలంలో కూడా ముఖం మెరిసేలా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు. స్కిన్ ఎక్స్ పర్డ్స్, మన వంటగదిలో ఉండే వస్తువులతోనే స్కిన్ మెరిసేలా చేసుకోవచ్చని చెప్తున్నారు.

అలుగడ్డతో

స్కిన్ గ్లో అవడానికి అలుగడ్డ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలుగడ్డతో మసాజ్ చేసుకోవడం వల్ల ట్యాన్, డార్క్, సర్కిల్స్ పోతాయి. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు ఉప్పు కొంచెం నిమ్మరసం, శ్యాండల్ వుడ్ ఎసెన్షియల్  ఆయిల్ ను కలిపి అలుగడ్డ ముక్కపైన దాన్ని అప్లై చేసి దాంతో 15-20 నిమిషాల పాటు మసాజ్ చేసి నీళ్లతో శుభ్రం చేసుకుంటే ట్యాన్ పోతుంది..

మెరుపు కోసం కీరదోస

ఫేస్ బ్రైటనింగ్, కూలింగ్ కోసం కీరదోస చాలా ఉపయోగపడుతుంది. కాస్త కీరదోస తురుములో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి  ముఖానికి రాసుకోవాలి. 10-15 నిమిషాల పాటు ఉంచుకుని కడిగేసుకుంటే చర్మం మెరుస్తుంది. కీరదోసకాయ చర్మాన్ని చల్లబరిస్తే నిమ్మరసం ముఖాన్ని మెరిసేలా, ముడతలు పడకుండా చేస్తుంది.

డెడ్ స్కిన్ పోగొట్టుకునేందుకు టమాట

ఒక టమాటా ముక్క మీద కొంచెం చక్కెర లేదా సాల్ట్ వేసుకుని ముఖం మీద సున్నితంగా రుద్దితే ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ పోవడమే కాకుండా పోర్స్ మినిమైజ్ అవుతాయి.

బియ్యప్పిండితో స్క్రబ్

బియ్యప్పిండి స్క్రబ్ లాగా కూడా పనికొస్తుందని చెప్తున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మంపైన ఉన్న ఆయిల్, మలినాలను తొలగించేందుకు బియ్యప్పిండి స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్  బియ్యప్పిండి, అలోవెరా జెల్ కు చిటికెడు సాల్ట్, రెండు చెక్కల లావెండర్ ఎషన్షియల్ ఆయిల్ ను కలిపి ముఖానికి పట్టించాలి. 5 to10 నిమిషాల తర్వాత దాంతో స్క్రబ్  చేసుకోవాలి. దాదాపు 5 to15 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని  కడిగేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.